: గవర్నర్ పెత్తనం.. తెలంగాణ ప్రజలను అవమానించినట్టే: కేసీఆర్
ఇప్పటిదాకా ఉన్న 28 రాష్ట్రాలతో కేంద్రానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, తెలంగాణ రాష్ట్రంతోనూ అలాంటి సంబంధాలే ఉండాలని ప్రధానిని కోరుతున్నామని కేసీఆర్ తెలిపారు. వేరే రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణ రాజధానిపై కేంద్రం అధికారం చెలాయించడం ఏ మాత్రం సహించరానిదని అన్నారు. తెలంగాణపై గవర్నర్ అధికారం చెలాయిస్తే, అది ఇక్కడి ప్రజలను అవమానించినట్టేనని చెప్పారు.