: ఇప్పటికైనా కేంద్రాన్ని కూల్చండి: అంబటి రాంబాబు
తాను సీఎంగా ఉన్నంత కాలం రాష్ట్ర విభజన జరగదని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజనకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇప్పటికైనా ఆయన రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. 19 మంది ఎంపీలు గతంలోనే రాజీనామా చేసుంటే కేంద్రం కుప్పకూలేదన్న ఆయన, ఇప్పటికైనా కేంద్రాన్ని కూల్చేస్తే విభజన ఆగిపోతుందని సూచించారు.