: నాలుగు సీట్లు, రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని చీల్చారు: జేపీ


మూడు ప్రాంతాల నేతలనూ కూర్చోబెట్టి... సామరస్యపూర్వకంగా విభజన చేసే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ అధిష్ఠానం అలా చేయలేదని లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ విమర్శించారు. కేవలం నాలుగు సీట్లు, రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని చీల్చారని అన్నారు. అన్ని ప్రాంతాల్లోకి రాయలసీమ బాగా వెనుకబడిందని... ఆ ప్రాంత ప్రయోజనాలను తుంగలో తొక్కి విభజన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశ భవిష్యత్తు అంధకారంలో పడిందని జేపీ ఎద్దేవా చేశారు. విభజన బిల్లు పార్లమెంటు, అసెంబ్లీకి వచ్చినప్పుడు... ప్రజాప్రతినిధులందరూ తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాలని సూచించారు.

  • Loading...

More Telugu News