: మరో రికార్డు సృష్టించిన ధోనీ


టీమిండియా కెప్టెన్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత దేశ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ రికార్డును జోహెన్నెస్ బర్గ్ లో ధోనీ సాధించాడు. ఓటమి శిరోభారంతో ఉన్న టీమిండియాకు ఈ వార్త కాస్త ఆనందం కలిగించేదే. ఇప్పటి వరకు టీమిండియా కెప్టెన్లలో మహ్మద్ అజహరుద్దీన్ మాత్రమే 5239 పరుగులు సాధించాడు.

ఇప్పడు 5278 పరుగులతో ధోనీ ఈ రికార్డును తిరగరాశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. అతనికంటే ముందు రికీ పాంటింగ్ ఉన్నాడు. కెప్టెన్ గా పంటర్ 8497 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News