: విభజన విధానం సరిగా లేదు.. సుప్రీంకోర్టుకెళ్తా: రఘురాజు
ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, వైఎస్సార్సీపీ నేత రఘు రామకృష్ణం రాజు స్పందించారు. విభజన ప్రక్రియ రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాజధాని అంశం రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. 371 (డి) అధికరణాన్ని రెండు రాష్ట్రాలకు ఎలా అమలు చేస్తారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. న్యాయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు.