: పంచదార పరిశ్రమలకు వడ్డీ లేని రుణాలు: శరద్ పవార్
దేశంలో పంచదార పరిశ్రమలకు 7,200 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తామని కేంద్ర మంత్రి శరద్ పవార్ ప్రకటించారు. పంచదార పరిశ్రమలు తీసుకున్న రుణాలకు సంబంధించి 12 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుందని ఆయన వెల్లడించారు. ఆ రుణాలను చక్కెర పరిశ్రమలు చెరకు రైతులకు అందిస్తాయన్నారు.