: మహిళలపై వ్యాఖ్యలతో ఇరుకున పడ్డ ఫరూక్ అబ్దుల్లా


ఈ రోజు పార్లమెంటులోకి ప్రవేశిస్తూ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళలతో మాట్లాడాలంటేనే భయం వేస్తోందని, తనకు ఇంతవరకు మహిళా సెక్రెటరీనే లేదని, ఏ చిన్న ఫిర్యాదు అందినా తన జీవితం జైల్లో అంతమవుతుందని, అందుకే మహిళలంటే తనకు భయమని ఫరూక్ కామెంట్ చేశారు. ప్రస్తుతం దేశ పరిస్థితి ఇలా తయారయిందని అన్నారు. అయితే, వెంటనే ఆయన నాలుక కరుచుకున్నారు. తాను మహిళలను కించపరచడం లేదని, సమాజం గురించి మాత్రమే చెబుతున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అయ్యాయి. సాక్షాత్తు ఆయన కుమారుడు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా... తన తండ్రి ఈ వ్యాఖ్యలను సరదాగా చేసినా, ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా సంఘాలు ఫరుక్ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి.

  • Loading...

More Telugu News