: విభజన నిర్ణయానికి నిరసనగా సచివాలయ ఉద్యోగుల ర్యాలీ
రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా సచివాలయ ఉద్యోగులు ఎల్ బ్లాక్ వద్ద ధర్నా చేశారు. ఎల్ నుంచి సి బ్లాక్ వరకు వారు బైక్ ర్యాలీ నిర్వహించారు. సచివాలయ ప్రాంగణం సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో, కేంద్ర ప్రభుత్వం కనీసం రాజ్యాంగ విలువలను కూడా పాటించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియను ఆపేందుకు సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.