: నన్ను రెచ్చగొట్టొద్దు: వంగవీటి రాధా


విజయవాడ చాలా ప్రశాంతంగా ఉందని.. తన పనేదో తాను చూసుకుంటున్నానని, తనను రెచ్చగొట్ట వద్దని వంగవీటి రాధా హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ, వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన బంద్ కు మద్దతుగా రెండు పార్టీలకు చెందిన నేతలు విజయవాడలో ఎదురు పడ్డ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. టీడీపీ యువనేత దేవినేని చంద్రశేఖర్ సమైక్యాంధ్ర బంద్ కు మద్దతుగా ర్యాలీకి వెళ్లిన సందర్భంగా వంగవీటి రాధా ఇంటిముందు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వంగవీటి రాధా.. తన తండ్రిని చంపినవారు తన ఇంటి ముందుకు వచ్చారని.. తనను రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో టీడీపీ నేత చంద్రశేఖర్ మాట్లాడుతూ వారే అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అంతవరకు వస్తే తాము కూడా తగ్గమని అన్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. వివాదానికి ముగింపు పలికారు.

  • Loading...

More Telugu News