: కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలవడం ఖాయం: బాలరాజు
రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ విభజనతో సీమాంధ్ర ఎడారిగా మారుతుందని అన్నారు. విభజనకు అనుకూలంగా బ్లాంక్ చెక్కులా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చారని అన్నారు. రాష్ట్ర విభజనకు కేబినెట్ ఆమోదించడంతో నేడు సీమాంధ్రకు బ్లాక్ డే అని బాలరాజు అభివర్ణించారు.