: పార్టీ కోసం ప్రాణాలిచ్చినవాళ్లున్నారు: 'దాడి' వ్యవహారంలో బాబు వ్యాఖ్య


ఎమ్మెల్సీ వ్యవహారంలో పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గుర్తింపు కోసం తాపత్రయపడడంలో తప్పులేదంటూనే, పార్టీ కోసం ప్రాణాలిచ్చిన వాళ్లున్నారంటూ ఎత్తిపొడిచారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన దాడి ఈరోజు పార్టీపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బాబు పైవిధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన మాట్లాడుతూ, ఇదో సమస్య కానేకాదన్నారు. ఈరోజు ఉదయం దాడితో మాట్లాడేందుకు యత్నించానని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు.

ఇక, సామాజిక న్యాయం పాటించేందుకే యనమల, శమంతకమణి, మహ్మద్ సలీంలను ఎమ్మెల్సీ అభ్యర్దులుగా ప్రకటించామని వివరించారు. సామాజిక న్యాయం, కష్టించే గుణం ప్రాతిపదికగా టిక్కెట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో మూడు ప్రాంతాలకు సముచిత స్థానం కల్పించామని బాబు పేర్కొన్నారు.

పార్టీలో పేదనాయకులు చాలామందే ఉన్నారన్న బాబు, కులాలతో పనిలేకుండా అందరూ బాగానే పనిచేస్తున్నారని తెలిపారు. కాగా, బ్రాహ్మణులు, వైశ్యులు పార్టీలో కష్టించి పనిచేస్తున్నారని, వారికీ అవకాశాలు కల్పిస్తామని బాబు ముక్తాయించారు. 

  • Loading...

More Telugu News