: కేంద్రాన్ని పడగొడతాం.. తొడగొట్టిన లగడపాటి


రాజీనామాలకు ఏడుగురు ఎంపీలం సిద్ధమని ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ అధికార పక్షంలో ఉన్న 15 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం పడిపోతుందని అప్పుడు బిల్లు ఆగిపోతుందని అన్నారు. తమ ఏడుగురితో పాటు మిగిలిన ఎంపీలు కూడా కలసి వస్తారని తాను ఆశిస్తున్నానని లగడపాటి వెల్లడించారు. కేంద్ర మంత్రులు కూడా తమతో కలిసి వస్తారని తెలిపిన ఆయన... ఇప్పటికే సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రధాని అపాయింట్ మెంట్ అడిగారని చివరిసారి ప్రధానితో చెప్పి రాజీనామాలు చేస్తారని ఆయన అన్నారు.

కేవలం జగన్ ను చూసుకుని కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుడు నిర్ణయం తీసుకుందని, తాము నాలుగు సంవత్సరాలుగా సమైక్యరాష్ట్రానికి మద్దతుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో చూస్తామని రాజ గోపాల్ సవాలు విసిరారు. తమ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల తిరుగుబాటుదారుల్ని కలుస్తామని, అవసరమైతే ప్రభుత్వాన్నే పడగొడతామని లగడపాటి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News