: నన్ను ఎదుర్కోలేకే.. కారుపై దాడి చేశారు: తణుకు ఎమ్మెల్యే


తణుకు నియోజకవర్గంలో ఎంతో ప్రజాభిమానం సంపాదించుకున్న తనను ముఖాముఖి ఎదుర్కోలేకే... వైకాపా శ్రేణులు తన కారుపై దాడికి పాల్పడ్డాయని తణుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు. వైకాపా చేస్తున్న ధర్నాలో పాతిక మంది కూడా లేరని ఎద్దేవా చేశారు. వైకాపా తరఫున తణుకు నియోజకవర్గంలో ఇప్పటికే ఎంతో మంది నేతలు మారారని... ఎవరూ ప్రజాభిమానం సంపాదించుకోలేకపోయారని అన్నారు. తాను ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతోనే కాకుండా, చేతులతో కూడా కొట్టి అద్దాలు పగులగొట్టారని తెలిపారు. పార్టీ అధికారంలోకి రాకముందే ఇంతకు తెగిస్తున్నవారు, అధికారంలోకి వస్తే ఎలా చెలరేగిపోతారో ఊహించుకోవచ్చని అన్నారు. టీడీపీ, ఏపీఎన్జీవోలు కూడా ధర్నా చేస్తున్నాయని... వారెవరూ ఇలా ప్రవర్తించలేదని అన్నారు.

  • Loading...

More Telugu News