: ఇవాళ పలు వర్శిటీల్లో పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన నేపధ్యంలో రాజకీయ పార్టీలు 48 గంటల బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. విశాఖపట్నంలోని ఆంధ్రా వర్శిటీలో ఇవాళ, రేపు జరగవలసిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్శిటీ ప్రకటించింది. ఇవాళ జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమో పరీక్షలు జనవరి 2వ తేదీకి వాయిదా వేశారు. కాకినాడ జేఎన్టీయూ పరిధిలోని 234 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ, అనంతపురంలోని శ్రీ కృష్ణ దేవరాయ వర్శిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్లు వర్శిటీ అదికారులు ప్రకటించారు.