: తెలంగాణ బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు వ్యతిరేకించాలి: అశోక్ బాబు
తెలంగాణ ప్రక్రియపై కేంద్ర కేబినెట్ మరింత ముందుకెళ్లిన నేపథ్యంలో, టీ బిల్లు రాష్ట్ర శాసనసభకు వచ్చినప్పుడు సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యతిరేకించాలని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. విభజన ప్రక్రియలో కేంద్రం అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఈ నెల 9న హైదరాబాదులో జరిగే స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆందోళన కార్యక్రమాల వివరాలు ప్రకటిస్తామని అశోక్ బాబు స్పష్టం చేశారు.