: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు... తిరుచానూరుకు పోటెత్తిన భక్తులు


చిత్తూరు జిల్లా తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజున కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. స్వర్ణాలంకార శోభితురాలైన పద్మావతి అమ్మవారు బ్రహ్మరథంపై ఆసీనురాలై తిరువీధుల్లో విహరించారు. ఇవాళ ఉదయం రెండు గంటల పాటు రథోత్సవం సాగింది. ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో తిరుచానూరు వీధులు జనసంద్రంగా మారాయి. రథోత్సవానికి ముందు అమ్మవారికి సుప్రభాతం, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ రాత్రి అమ్మవారికి అశ్వ వాహన సేవ జరుగనుంది.

  • Loading...

More Telugu News