: లక్షన్నర రూపాయల కోసం భార్యను నలుగురికి పంచాడు


రెండక్షరాల డబ్బు మానవుడిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుందని చెప్పడానికి ఇదో ఉదాహరణ. లక్షన్నర రూపాయల కోసం పశ్చిమబెంగాల్ కు చెందిన 26 ఏళ్ల ఇస్సార్ అలీ లష్కర్ నలుగురి స్నేహితుల లైంగికానందానికి తన అర్ధాంగిని పణంగా పెట్టాడు. దీనికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

పశ్చిమబెంగాల్ నుంచి ముంబై వెళ్లిపోవడానికి అలీ తన భార్యను ఒప్పించాడు. మరుసటి రోజు తన స్నేహితులు నలుగురికి కాల్ చేశాడు. లక్షన్నర రూపాయలు ఇస్తే తన భార్యను ఒక రాత్రికి పంపుతానని ఆఫర్ చేశాడు. 30న రాత్రి భార్యను తీసుకుని మన్ ఖుర్ద్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అప్పుడే అక్కడకు నలుగురు కామాంధులు వచ్చి ఉన్నారు. వారితో కలిసి ఆటోలో వెళ్లమని అలీ తన భార్యకు చెప్పాడు. ఆటో వెనకే అతడు బయల్దేరాడు. కొంతదూరం వెళ్లాక అటో ఎటో వెళ్లిపోయింది.

భైగాన్ వాడి లోని జాకీర్ హుస్సేన్ నగర్ కు తీసుకెళ్లి ఆమెపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె అరుపులు విన్న స్థానికులు నలుగురు దుండగులను పోలీసులకు పట్టిచ్చారు. అలీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇంతచేసీ దుండగులు అలీకి రూపాయి కూడా ఇవ్వలేదు.

  • Loading...

More Telugu News