: భద్రతా వలయంలో అయోధ్య
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరం పటిష్ఠ భద్రతా వలయంలో చిక్కుకుంది. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని 10వేల మంది పోలీసులు అయోధ్య నగరాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. సరయూ నది తీరం వెంబడి కూడా భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పోలీసులు అణువణువూ పరిశీలిస్తూ ప్రతీ క్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నగరం చుట్టూ మూడంచెల భద్రతా వలయాన్ని అక్కడి సర్కారు ఏర్పాటు చేసింది. ముస్లిం సంస్థలు చీకటి దినంగా జరుపుకుంటుంటే.. హిందూ సంస్థలు విజయదినోత్సవంగా జరుపుకుంటున్నాయి.