: పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ
రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం, సీమాంధ్రలో మొదలైన ఆందోళనలపై వీరు చర్చిస్తున్నారు. అంతే కాకుండా, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా వీరు దృష్టి సారించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే రెండు రోజులు బంద్ కు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.