: ముందు కామసూత్రను నిషేధించండి: ప్రియాంక చోప్రా


మహిళలపై నేరాలకు కళలు (సినిమాలు తదితర) కారణమైతే.. ముందు చారిత్రక ప్రాధాన్యంగల అజంతా ఎల్లోరా గుహలతోపాటు వాత్సాయనుడి కామసూత్రను తప్పక నిషేధించాలని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అభిప్రాయపడింది. ప్రజలకు సహనం తక్కువ.. తీర్పునిచ్చే స్వభావం ఎక్కువ అని చిటపటలాడింది. సినిమాలు, పాటలు మహిళలపై అత్యాచారాలకు కారణమైతే.. ముందు అజంతా ఎల్లోరా గుహలను ఎందుకు మూయరు? ఇది కామసూత్రకు నెలవైన దేశం.. ముందు ఆ పుస్తకాలను నిషేధించండి అంటూ తేల్చిపడేసింది. శిల్పాలు చెక్కడం ఒక కళ.. పద్యాలు ఒక కళ.. సినిమా ఒక కళ. సినిమాలకు సెన్సార్ అనేది ఉంది. చట్టాలను అనుసరించాలి. 'ఎ' సర్టిఫికెషన్ ఉన్న సినిమాలను చిన్నారులు ఎందుకు చూడాలి.. చట్టంలేనితనం కనిపిస్తోంది అంటూ ప్రియాంక మండిపడింది.

  • Loading...

More Telugu News