: టీడీపీ 48 గంటల బంద్ కు హరికృష్ణ మద్దతు
విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ పిలుపునిచ్చిన 48 గంటల బంద్ కు ఆ పార్టీ సీనియర్ నేత హరికృష్ణ మద్దతు తెలిపారు. బంద్ కు తన సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో ప్రకటన చేశారు. అసమర్థ నేతల వల్లే దేశానికి ఇలాంటి గతి పట్టిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ, తెలుగుజాతి ఆత్మగౌరవం పేరుతో, ఇప్పటికే రెండుసార్లు హరికృష్ణ ప్రజలకు లేఖలు రాసి తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.