: పార్టీకి, పదవికి మంత్రి గంటా రాజీనామా
రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. కోట్లాది తెలుగు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తనతో పాటు మరికొందరు నేతలు కూడా ఇదే బాటలో ఉన్నారని తెలిపారు. సాయంత్రం తన రాజీనామా నిర్ణయాన్ని సీఎం కిరణ్ కు తెలియజేస్తానని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన విశాఖలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐబీ చీఫ్ లాంటి వారు హెచ్చరించినా కూడా బేఖాతరు చేయకుండా, విభజన నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు. తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న పార్టీలో తాను కొనసాగలేనని గంటా స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న రోజును బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు.