: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర బంద్
కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఈ రోజు సీమాంధ్ర బంద్ జరుగుతోంది. ఈ బంద్ కు వైఎస్సార్సీపీ, టీడీపీ సీమాంధ్ర ఎంపీలు, ఏపీ ఎన్జీవోలు పిలుపునిచ్చారు. దీంతో సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో పోలీసులను భారీగా మోహరించారు. సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. ఆంధ్రా, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాల పరిధిలో ఇవాళ, రేపు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు.