: అమెరికాలో తుపాకీ టీచర్లు..!


ఇటీవల కాలంలో పాఠశాల చిన్నారులపై ఉన్మాదుల కాల్పుల ఘటనలు మిక్కిలిగా చోటు చేసుకోవడంతో అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్రం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇకనుంచి ఆ రాష్ట్రంలో పాఠశాలల్లోని టీచర్లు, ఇతర ఉద్యోగులు తుపాకీలు ధరించవచ్చని ఓ చట్టం తీసుకువచ్చింది. తాజా చట్టంపై సౌత్ డకోటా గవర్నర్ డెన్నిస్ డాగార్డ్ శుక్రవారం ఆమోదముద్ర చేశారు.

అయితే, ఈ చట్టం వస్తే తమ ప్రాంగణాలు మరింత ప్రమాదకరంగా తయారవుతాయని పాఠశాలలు సందేహాలు వ్యక్తం చేశాయి. కాగా, ఈ నూతన చట్టం జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. సౌత్ డకోటా బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు నడవనున్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News