: ఆ సూట్ వెల అర కోటి పైమాటే!
ఒక సూట్ వెల లక్షలు పలికింది. అంత ధర పలకడానికి అదేమన్నా బంగారంతో చేసినదా... లేదా వజ్రాలు పొదిగారా? అన్న అనుమానం రావచ్చు మీకు... అదేంకాదు. అది ప్రముఖ నటుడు బ్రూస్‌లీ ధరించిన సూటు. కాబట్టే దానికి అంత రేటుపెట్టి ఆయన అభిమానులు సొంతం చేసుకున్నారు.
కుంగ్‌ఫూ వీరుడు బ్రూస్‌లీ తన ఆఖరి చిత్రం 'గేమ్ ఆఫ్ డెత్'తో ధరించిన పసుపురంగు జంప్ సూట్‌ను హాంకాంగ్‌లో జరిగిన ఒక వేలంలో విక్రయించారు. బ్రూస్‌లీ 40వ వర్థంతి సందర్భంగా ఈ సూట్‌ను వేలం వేయగా ఒక అజ్ఞాత వ్యక్తి ఈ సూటును లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారు. హాంకాంగ్‌లో జరిగిన వేలం పాటలో ఈ సూట్ 62,05,392 రూపాయల ధర పలికింది. మొన్నటికి మొన్న ప్రిన్సెస్ డయానా ధరించిన గౌను కోటి రూపాయలు పలికింది. ఇప్పుడు ఈ సూట్ లక్షల ధర పలికింది. మొత్తానికి అభిమానానికి హద్దు లేకుండా పోతోంది.