: మదిలోని మాట చెబుతుందట!
మన మదిలోని మాట మనం చెబితేనే తెలుస్తుంది. ఎదుటివారికి ఎలా తెలుస్తుంది...? కానీ ఈ పరికరం మాత్రం మన మదిలోని భావాలను చక్కగా మనకే తెలియజేస్తుందట. ఒక్కోసారి మనం ఎదుటివారితో మాట్లాడాలా? వద్దా? అనే డైలమాలో పడుతుంటాం. కొందరితో మాట్లాడాక మన మూడ్ ఎలా మారుతుందో అని అనుకుంటుంటాం. ఇలాంటి సందర్భాల్లో ఈ కొత్తరకం స్వెట్టర్‌ను ధరిస్తే చాలు మన మదిలోని భావాలను ఇది చక్కగా తెలుపుతుందట.
అమెరికాలోని డిజైన్ ట్యాబ్ సెన్సరీ ఒక కొత్తరకం స్వెట్టర్‌ను రూపొందించింది. ఈ జీఈఆర్ స్వెట్టర్‌ను ధరించిన వారు మన మనసులోని భావాలను చక్కగా తామే తెలుసుకోవచ్చని దీన్ని రూపొందించిన పరిశోధకులు చెబుతున్నారు. లై డిటెక్టర్ టెస్ట్‌లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారుచేసిన ఈ స్వెట్టర్ మన మదిలోని భావాలను చక్కగా తెలియజేస్తుందట. మన మనసులోని భావాలను ఇందులోని గాల్వనిక్ సెన్సార్లు గ్రహించి అందుకు అనుగుణంగా కాలర్ దగ్గరున్న ఎల్‌ఈడీ లైట్లు కాంతిని విరజిమ్ముతాయట. మొత్తానికి మదిలోని భావాలను తెలిపే పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.