: మధుర సమీపంలో ఏపీ ఎక్స్ప్రెస్ లో దుండగుల కాల్పులు: ముగ్గురి మృతి


ఉత్తరప్రదేశ్ లోని మధురకు సమీపంలో ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ ఎస్-6 బోగీలో ఈ ఘటన జరిగింది. ఖైదీలను రైలులో తీసుకువెళుతున్న పోలీసులపై దుండగులు కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. కాల్పుల అనంతరం ఇద్దరు ఖైదీలు తప్పించుకుని పోయినట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News