: 10 జిల్లాల తెలంగాణాకు కేంద్ర కేబినెట్ ఆమోదం


సుమారు మూడున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కేంద్ర కేబినెట్ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 10సంవత్సరాల పాటు గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని షిండే తెలిపారు. రేపు, లేదా ఎల్లుండి తెలంగాణ బిల్లు రాష్ట్రపతికి పంపించనున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ పాలన బాధ్యత తెలంగాణ గవర్నరుదేనని తెలిపారు. ఆర్టికల్ 371- డీ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని ఆయన తెలిపారు. అసెంబ్లీకి ఎంత సమయం ఇవ్వాలనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారని షిండే వివరించారు.

ఉభయ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని, నీటి కేటాయింపుల బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటుకు నిపుణుల కమిటీని నియమిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని, ఈ కమిటీ తన నివేదికను 45 రోజుల్లో ఇస్తుందని ఆయన వెల్లడించారు.పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.

  • Loading...

More Telugu News