: 10వ తేదీ నుంచి మళ్లీ అవినీతి వ్యతిరేక ఉద్యమం: అన్నాహజారే
ఈ నెల 10వ తేదీ నుంచి మళ్లీ అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టనున్నట్లు సామాజిక కార్యకర్త అన్నాహజారే న్యూఢిల్లీలో ప్రకటించారు. అవినీతి నిర్మూలన ఉద్యమం ఊపందుకున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పార్టీ స్థాపించడం సరైన చర్య కాదని హజారే అన్నారు. అవినీతి నిర్మూలనకు కలిసి పోరాడాల్సిన సమయంలో కేజ్రీవాల్ రాజకీయ రంగ ప్రవేశాన్ని అన్నా సమర్థించలేదు. అయితే కేజ్రీవాల్ తో పోరాడాల్సిన అవసరం లేదని, ఎన్నికల్లో నిధుల సమీకరణకు తన పేరు వాడుకోవద్దని మాత్రం సూచించానని ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలపై తాము అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపడుతున్నామన్నారు.