: తొలి వికెట్ తీసిన టీమిండియా.. భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా
టీమిండియా బౌలర్లు మరోసారి పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో జొహానెస్ బర్గ్ లో తొలి వన్డే ఆడుతున్న టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కొత్త బంతితో చెలరేగాల్సిన భారత బౌలర్లు వికెట్లు తీసేందుకు నానాతంటాలు పడ్డారు. ఏమాత్రం ప్రభావం చూపని భారత బౌలింగ్ ను సఫారీలు సునాయాసంగా ఆడుకున్నారు. దీంతో 30 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన భారత జట్టు అందరు బౌలర్లను ప్రయోగించినా పెద్దగా ఫలితం సాధించలేకపోయింది. ఎట్టకేలకు మహ్మద్ షమి ఆమ్లా(65)ను బౌల్డ్ చేసి తొలి వికెట్ తీశాడు. దీంతో సౌతాఫ్రికా 31 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 167 పరుగులు చేసింది. క్రీజులో డీ కాక్(92), కలిస్(5) ఉన్నారు.