: మహబూబ్ నగర్ జిల్లా వోల్వో బస్సు బాధితులకు ప్రభుత్వ పరిహారం
మహబూబ్ నగర్ జిల్లా పాలెం వోల్వో బస్సు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇచ్చింది. ఘటన జరిగిన నెల రోజులకు కూడా తమకు న్యాయం చేయలేదని నాలుగు రోజుల కిందట బాధిత కుటుంబాలు ధర్నా, నిరసనలు చేశాయి. దాంతో, కొంత స్పందించిన ప్రభుత్వం ఈ రోజు పరిహారం అందించడం విశేషం.