: యెడ్యూరప్పను తిరిగి పార్టీలోకి ఆహ్వానించబోతున్న బీజేపీ!
బీజేపీ నుంచి బయటికి వచ్చి కర్ణాటక జనతా పార్టీ పేరుతో యెడ్యూరప్ప సొంత పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. కాగా, మరో ఐదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో, విజయబావుటా ఎగరవేసే వ్యూహంతో కమలం పార్టీ మాజీలను దగ్గర చేసుకోబోతోందని వినికిడి. ఈ క్రమంలో యెడ్యూరప్పను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్.. కర్ణాటక నేతలు అనంతకుమార్, ఈశ్వరప్పలకు తెలియజేసినట్టు సమాచారం.