: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలో 'కార్పోరేట్ సేవా కేంద్ర'


భారతదేశంలో కార్పొరేట్ వ్యవహారాలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ దిశగా ప్రణాళిక రూపొందించిన సర్కారు.. 'కార్పోరేట్ కాల్ సెంటర్' ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ కాల్ సెంటర్.. కార్పొరేట్ సంస్థలకు వాటా దారులకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. 

వ్యాపార వర్గాలకు వారు కోరిన సమాచారాన్నితక్షణమే అందించడం కాకుండా.. కంపెనీలకు, వాటాదారులకు నష్ట పరిహారాన్ని అందజేసే విషయంలో మధ్యవర్తిగానూ వ్యవహరిస్తుంది. కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్నఈ కాల్ సెంటర్ ను 'కార్పొరేట్ సేవా కేంద్ర' గా పిలవనున్నారు. 

ఎక్కువ మొత్తంలో కార్పొరేట్ వాటాదారులకు సమాచారాన్నిఅందించడం, కార్పొరేట్ సంస్థల పై దాఖలైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి విధులను ఈ సేవా కేంద్రం నిర్వర్తిస్తుందని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి ఏర్పాటు చేయాలనుకుంటున్నకాల్ సెంటర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రతిపాదించిన ఈ సెంటర్ 2012-2014 ఆర్ధిక సంవత్సరంలో భాగంగా ఏర్పాటు చేయడమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News