: విశాఖ టీడీపీలో ఎమ్మెల్సీ రగడ
విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ సీటు వ్యవహారం తలనొప్పిగా మారింది. దాడి వీరభద్రరావుకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వనందుకు ఆయన అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 600 మంది కార్యకర్తలు తమ రాజీనామా పత్రాలను అధినేత చంద్రబాబు నాయుడికి పంపారు. దీంతో, చంద్రబాబు నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. వెంటనే నామా, సుజనా చౌదరిలను పురమాయించి దాడిని సముదాయించాలని సూచించారు.