: బాడీ గార్డ్ ను టేబుల్ గార్డ్ గా మార్చుకున్న జగన్!


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అంగరక్షకుడిని టేబుల్ గార్డ్ గా మార్చుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చోటు చేసుకుంది. హెలెన్ తుపాను బాధితులను పరామర్శించేందుకు గతనెలలో జగన్ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఓ పొలంలోకి వెళ్లిన జగన్ రైతులనుద్దేశించి మాట్లాడారు. మాట్లాడటం పూర్తయ్యేవరకు బాడీ గార్డ్ టేబుల్లా వంగి జగన్ కు ఆసరాగా నిలిచాడు. ఈ వైఖరిపై పలు వైపుల నుంచి విమర్శలు వస్తుండగా, జిల్లాల్లో దీనిపైనే మాట్లాడుకుంటున్నారు.

  • Loading...

More Telugu News