: బిల్లు చూసిన తరువాత చెబుతాం: వెంకయ్యనాయుడు
తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే రాయల తెలంగాణను మాత్రం సమర్థించమని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 10 జిల్లాలతో కూడిన తెలంగాణకు మాత్రమే తాము మద్దతు పలుకుతున్నామని స్పష్టం చేశారు. ఎవరి ఆలోచనలను వారు చెబుతున్నారు తప్ప, ఇంతవరకు ప్రభుత్వం ఏరకమైన ప్రకటన చేయలేదని.. బిల్లు వచ్చిన తరువాత అందులోని అంశాలను పరిశీలించి తమ అభిప్రాయం చెబుతామని వెంకయ్యనాయుడు అన్నారు.