: సీమ నేతలే సీమను చీల్చే కుట్ర చేస్తున్నారు: ఎంపీ పొన్నం
రాయలసీమ ఆత్మ గౌరవానికి తాము వ్యతిరేకం కాదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సీమ ప్రాంతాన్ని విభజించే అంశంతో తమకు సంబంధం లేదని చెప్పారు. సీమ నేతలే రాయలసీమను చీల్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పది జిల్లాల తెలంగాణ మాత్రమే తమకు కావాలని టీకాంగ్రెస్ నేతలందరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. రాయల తెలంగాణ కేవలం ఒక చర్చ మాత్రమేనని... దాని గురించి తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ పొన్నం అన్నారు.