: అనంతపురంలో కేంద్ర బలగాల కవాతు
రాష్ట్ర విభజన విషయంలో తుది ప్రకటన వెలువడటానికి సమయం దగ్గర పడుతుండటంతో, పోలీసు వ్యవస్థ అలర్ట్ అయింది. క్షణాల్లో ఆందోళనలు చెలరేగే అవకాశం ఉన్న అనంతపురం జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంతో, అనంతపురంలో కేంద్ర బలగాలు రోడ్ల మీద కవాతు చేస్తున్నాయి. అంతేకాకుండా, జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. దీనికి తోడు, జిల్లాలోని కీలక రాజకీయ నేతల నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.