: శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదు: కేంద్ర మంత్రి అజిత్ సింగ్


ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి, ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ స్పష్టం చేశారు. ఈ రోజు తనను కలిసిన తెలంగాణ జేఏసీ నేతలతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ లేదా ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. 2014 ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని అజిత్ సింగ్ తెలిపారు. పది జిల్లాల తెలంగాణకే తమ పార్టీ (ఆర్ఎల్డీ) మద్దతు ఇస్తుందని టీజాక్ నేతలకు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News