: రాయల తెలంగాణ దిష్టి బొమ్మను దహనం చేసిన సీపీఐ నారాయణ
క్రిమినల్ గ్యాంగ్ ఆలోచనల్లో నుంచే రాయల తెలంగాణ పుట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానంలో రాయల తెలంగాణ అంశమే లేదని అన్నారు. పది జిల్లాల తెలంగాణకే సీపీఐ మద్దతు ఇస్తుందని తెలిపారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ, హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలో ఆయన రాయల తెలంగాణ దిష్టి బొమ్మను దహనం చేశారు.