: 'మిస్ ఎర్త్-2013' పోటీల్లో విశాఖ అమ్మాయికి మరో గోల్డ్ మెడల్


పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా-2013 కిరీటాన్ని గెల్చుకున్న విశాఖ అమ్మాయి శోభిత ధూళిపాళ... ప్రస్తుతం ఫిలిప్పైన్స్ లో జరుగుతున్న 'మిస్ ఎర్త్-2013' కిరీటానికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పోటీల్లో శోభిత 'మిస్ ఎకో బ్యూటీ'గా ఎంపికై గోల్డ్ మెడల్ దక్కించుకుంది. సురక్షితమైన మంచినీరు వాడటం ఎంత ఉపయోగమనే విషయంపై తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా ప్రజలకు వివరించి, తనదైన ప్రచారం చేసింది. ఇందుకు గానూ ఆమెకు ఐదువేల ఓట్లు దక్కాయి. ఇదే పోటీల్లో శోభిత 'మిస్ ఫొటో జెనిక్'గా ఎంపికై మొదటి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News