: సోనియాతో తెలంగాణ ఎంపీల భేటీ
10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్నే ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు మరోసారి అధినేత్రి సోనియాకు విజ్ఞప్తి చేశారు. 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణను ప్రతిపాదిస్తూ జీవోఎం నివేదిక రూపొందించిందనే వార్తలు రావడంతో.. తెలంగాణ ఎంపీలు ఈ ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్లో సోనియాను కలుసుకున్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పార్టీలు 10 జిల్లాల తెలంగాణనే కోరుకుంటున్నాయని చెప్పారు.