: రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్ పర్యటన.. తెలంగాణ బిల్లు ఆలస్యమేనా?


తెలంగాణ బిల్లు మరింత ఆలస్యం కానుందా? అంటే మరో మూడు రోజుల పాటు తెలంగాణ బిల్లు ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. జీవోఎం రూపొందించిన ముసాయిదాను ఈ రోజు కేంద్ర కేబినెట్ ఆమోదించి, ఆనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపనుంది. తరువాత శాసనసభ అభిప్రాయం కోసం బిల్లును రాష్ట్రానికి పంపడం.. అనంతరం శాసనసభ అభిప్రాయాన్ని మళ్లీ రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. కాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపటి నుంచి మూడు రోజుల పాటు పశ్చిమ బెంగాల్ పర్యటనకు కోల్ కతా వెళ్లనున్నారు. ఆయన 8వ తేదీన తిరిగి ఢిల్లీ చేరుకోనున్నారు. దీంతో మరో మూడు రోజుల పాటు తెలంగాణ బిల్లు ఆలస్యం కానుందని సమాచారం.

  • Loading...

More Telugu News