: గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్ధులు గల్లంతు


ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాలలోని గోదావరి వద్ద విషాదం చోటు చేసుకుంది. మహా శివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. వెంటనే అక్కడివారు కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే వారు ప్రాణాలు విడిచారు. గల్లంతైన విద్యార్ధులు చింతిర్యాల వాసులుగా గుర్తించారు. 

చనిపోయిన వారిలో సలీం (13), రావులపల్లి చంటి (18), మహమ్మద్ తాజుద్దీన్ (7)ల మృత దేహాలు లభ్యమయ్యాయి. మిగతా ఇద్దరు సూర్య తేజ (10), పవన్ (12)ల మృత దేహాల కోసం స్థానికులు గాలిస్తున్నారు. ఈ ఘటన గోదావరి శ్రీరామరక్ష ఆంజనేయస్వామి గుడివద్ద చోటు చేసుకుందని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News