: నేను సలహా ఇస్తున్నా.. నా మాట ఇంటరా భయ్: వీహెచ్
'రాయలసీమ ఇమ్మని నేను చెప్తలేను... ఒంగోలు, నెల్లూరు కలుపుకుని రాయలసీమ తీసుకొర్రి' అని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సలహాఇచ్చారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 'నేను గొప్ప మనసుతో సలహా ఇస్తున్నారా భయ్.. నచ్చితే తీసుకోండ్రి, లేకుంటే ఊరుకొర్రి' అని సీమ వాసులకు సూచించారు. తాను ఇమ్మంటే రాయలసీమ ఇస్తారా? అని ఆయన మీడియాను ప్రశ్నించారు. సోనియా గాంధీ తలచుకుంటే రాయలసీమ కూడా ఇస్తారని, మరో రెండు జిల్లాలను కలుపుకుని రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని కోరండి అంటూ ఆయన చెప్పారు. రాయల తెలంగాణకు మాత్రం తాము ఒప్పుకునేది లేదని అన్నారు. తాము 10 జిల్లాలతో కూడిన తెలంగాణను మాత్రమే ఆమోదిస్తామని ఆయన స్పష్టం చేశారు.