: తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే వరకు ఎవరినీ నమ్మం: కోదండరాం
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పార్లమెంటులో పది జిల్లాల తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేలా టీకాంగ్రెస్ నేతలు ప్రయత్నించాలని టీజాక్ ఛైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ రోజు ఢిల్లీలో పార్లమెంటు దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే వరకు తాము ఏ పార్టీనీ నమ్మమని స్పష్టం చేశారు. ఢిల్లీలోనే ఉండి రేపు కూడా వివిధ పార్టీల నాయకులను కలుస్తామని తెలిపారు. ఈ క్రమంలో శరద్ పవార్, మాయావతిల అపాయింట్ మెంట్ లను కోరామని కోదండరాం చెప్పారు. పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నామని... తెలంగాణ విషయంలో తమ స్టాండ్ చాలా క్లియర్ గా ఉందని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ చెప్పారని తెలిపారు. 2014 ఎన్నికల్లోపు రాష్ట్ర విభజన జరగాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు.