: సల్మాన్ ఖాన్ కేసులో తాజా విచారణకు బాంబే హైకోర్టు ఆదేశం


పదకొండు సంవత్సరాల కిందట (2002,సెప్టెంబర్ 28న) ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నటుడు సల్మాన్ ఖాన్ వేగంగా కారు నడపడంతో, ఫుట్ పాత్ పై పడుకున్న ఓ వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాంబే హైకోర్టు తాజా విచారణకు ఆదేశించింది. అంతేగాక ఈ కేసులో సాక్ష్యాలు, ఆధారాలను పునఃసమీక్షించాలని ఆదేశించింది. తిరిగి కేసులో విచారణ ఈ నెల 24 నుంచి ప్రారంభవనుంది. సల్మాన్ పెట్టుకున్న పిటిషన్ ను ఈ రోజు పరిశీలించిన న్యాయస్థానం తాజా ఆదేశాలివ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News