: కోర్టుకు న్యాయమూర్తులను కూడా అనుమతించని న్యాయవాదులు
హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులోకి జడ్జ్ లు వెళ్లకుండ తెలంగాణ ప్రాంత న్యాయవాదులు అడ్డుకున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన జీవోఎం పరిశీలిస్తుందన్న వాదనలు, ఊహాగానాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ సందర్భంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. కోర్టు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి అక్కడే బైఠాయించారు. కోర్టు ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించకుండా ఆందోళన నిర్వహిస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వెనక్కి తీసుకోకుంటే తమ ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.