: సీఎంను కలసిన కొండా సురేఖ దంపతులు
తెలంగాణ ప్రాంతంలో కీలక నేతలైన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు ఈ రోజు సీఎం కిరణ్ ను కలుసుకున్నారు. వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరించిన వీరిద్దరూ... కొంత కాలం క్రితం ఆ పార్టీ అధిష్ఠానం వైఖరితో విసిగిపోయి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి కొండా దంపతులు రాజకీయల్లో అంతగా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఈ నేపథ్యంలో, సీఎంతో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.