: అక్బరుద్దీన్ ఒవైసీకి తగిలిన తెలంగాణ సెగ
హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండల పరిధిలోని జేపీ దర్గా వద్ద అక్బరుద్దీన్ కారుపై రాళ్లతో దాడి చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఇవాళ బంద్కు పిలుపునిచ్చిన నేపధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.